2022 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప ఎన్నిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2022 ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నిక

← 2019 2022 జూన్ 23
 
Party యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

నేపథ్యం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2022 ఫిబ్రవరి 21న గుండెపోటుతో మరణించడంతో ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.[1] భారత ఎన్నికల సంఘం 2022 మే 25న ఆత్మకూరు ఉప ఎన్నిక తోపాటు మరో ఆరు శాసనసభ నియోజకవర్గాలకు మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. [2][3]

షెడ్యూలు[మార్చు]

2022 మే 30న ఉప ఎన్నిక షెడ్యూల్ తో పాటు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది.[4]

ఎన్నికల ఈవెంట్ షెడ్యూల్ రోజు.
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ 30 మే 2022 సోమవారం
నామినేషన్ల దాఖలు చివరి తేదీ 6 జూన్ 2022 సోమవారం
నామినేషన్ల పరిశీలన తేదీ 7 జూన్ 2022 మంగళవారం
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 9 జూన్ 2022 గురువారం
పోలింగ్ తేదీ 23 జూన్ 2022 గురువారం
లెక్కింపు తేదీ 26 జూన్ 2022 ఆదివారం
ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే తేదీ 28 జూన్ 2022 మంగళవారం

అభ్యర్థులు[మార్చు]

ఉప ఎన్నికలలో మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.[5][6] ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. భారతీయ జనతా పార్టీ తమ పార్టీ అభ్యర్థిగా భరత్ కుమార్ ను నిలబెట్టింది.[7] రిటర్నింగ్ ఆఫీసర్ 13 నామినేషన్లు తిరస్కరించారు. తరువాత మొత్తం 15 మంది అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.[8]

ఫలితాలు[మార్చు]

2022 జూన్ 22న ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు చేపట్టింది అదే రోజు ఫలితాలను విడుదల చేసింది.. 82, 888 ఓట్ల మెజార్టీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు.[9][10]

మూలాలు[మార్చు]

  1. "Andhra minister Mekapati Goutham Reddy dies at 50 after cardiac arrest". The News Minute (in ఇంగ్లీష్). 2022-02-21. Retrieved 2022-05-26.
  2. "Andhra News: ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల". EENADU. Retrieved 2022-05-26.
  3. "Schedule for Bye-election in Parliamentary/Assembly Constituencies of various States". 25 May 2022.
  4. MUKESH KUMAR, MEENA (30 May 2022). "The Andhra Pradesh Gazette" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. Retrieved 31 May 2022.
  5. sumanth.k. "Andhra News: మేకపాటి కుటుంబం కీలక నిర్ణయం.. గౌతమ్ రెడ్డి రాజకీయ వారసుడిగా విక్రమ్ రెడ్డి". Asianet News Network Pvt Ltd. Retrieved 2022-05-26.
  6. Bandari, Pavan Kumar (2022-04-29). "Mekapati Goutham Reddy's brother Vikram Reddy meets YS Jagan, likely to contest from Atmakur by-election". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-05-26.
  7. Murali, S. (2022-06-07). "Andhra Pradesh: 15 candidates in fray for Atmakur bypoll". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-06-08.
  8. "Returning Officer rejects 13 nominations for Atmakur bypoll". The New Indian Express. Retrieved 2022-06-08.
  9. "Andhra bypoll: Construction magnate Mekapati Vikram Reddy retains Atmakur for YSRCP". The Indian Express (in ఇంగ్లీష్). 2022-06-26. Retrieved 2022-06-26.
  10. "Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం". EENADU. Retrieved 2022-06-26.