వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 10

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లింకులు

ఒక వ్యాసం వ్రాస్తున్నప్పుడు అందులో వచ్చే పదాలను తెవికిలోని ఇంకో వ్యాసానికి లింకు చేయాలంటే దాని చుట్టూ క్రింద చూపిన విధంగా స్క్వేర్ బ్రాకెట్లను వాడండి. ఉదాహరణకు మీరు తెలుగు అనే పేరుగల వ్యాసాన్ని లింకు చేయాలనుకుంటే, [[తెలుగు]] అని వ్రాయండి. తెలుగు అని చూపబడుతుంది.

అదే ఆంగ్ల వికీలో వ్యాసానికి లింకు చేయాలనుకుంటే, వ్యాసం పేరుకి ముందు :en: అని వ్రాయాలి. ఉదాహరణకు మీరు ఆంగ్ల వికీలో ని తెలుగు వ్యాసానికి లింకు చేయాలునుకుంటే, [[:en:Telugu]] అని వ్రాయండి. en:Telugu అని చూపబడుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా