వాణి సర్రాజు రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాణి సర్రాజురావు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. 1994 ఐఎఫ్ఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా వ్యవహరిస్తోంది. కాగా, ఆమెను రిపబ్లిక్ ఆఫ్ ఇటలీకి భారత రాయబారిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 27న ఉత్తర్వులు జారీ చేసింది.[1]

విద్యాభ్యాసం[మార్చు]

ఆమె విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లో సాగింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆమె పొలిటికల్‌ సైన్స్‌ లో ఎంఏ అభ్యసించింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె అమెరికా వెళ్ళింది. కాలిఫోర్నియాలోని సాన్‌జోస్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఆమె ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌లో ఎంఎస్‌  పూర్తిచేసింది.

కెరీర్[మార్చు]

అమెరికాస్‌ డివిజన్‌ డైరెక్టర్‌ గా, స్వీడన్‌లోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్‌ సెక్రటరీ గా, విదేశాంగశాఖ కార్యాలయంలో యూరప్‌ వెస్ట్‌ విభాగాల అండర్‌ సెక్రటరీగా సేవలందించిన ఆమె తొలి పోస్టింగ్‌ కింద మెక్సికో సిటీలోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వర్తించింది. 2011 నుంచి 2014 వరకు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయంలోని వాణిజ్య విభాగం అధిపతిగా, మిషన్‌ డిప్యూటీ చీఫ్‌గా చేసింది. 2017 నుంచి 2020 వరకు ఫిన్‌ల్యాండ్‌, ఎస్తోనియా రాయబారిగా పనిచేసింది.[2]

మూలాలు[మార్చు]

  1. "ఇటలీలో భారత రాయబారిగా వాణి సర్రాజురావు |". web.archive.org. 2023-10-28. Archived from the original on 2023-10-28. Retrieved 2023-10-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Vani Sarraju Rao concurrently accredited as the next Ambassador of India to the Republic of Estonia". web.archive.org. 2023-10-28. Archived from the original on 2023-10-28. Retrieved 2023-10-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)