రాజీ నారాయణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజీ నారాయణ్
జననం(1931-08-19)1931 ఆగస్టు 19
మరణం2020 సెప్టెంబరు 25(2020-09-25) (వయసు 89)
గుర్గావ్, న్యూ ఢిల్లీ, భారతదేశం[1]
వృత్తిభరతనాట్యం నృత్య గురువు
కొరియోగ్రాఫర్
కంపోజర్
సంగీతకారిణి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భరతనాట్యం
పిల్లలుశ్యాంసుందర్ నారాయణ్
తల్లిదండ్రులుఎస్. నారాయణ అయ్యర్, గంగమ్మాళ్
పురస్కారాలుసంగీత నాటక అకాడమీ అవార్డు[2]
ఠాగూర్ అకాడమీ పురస్కారం
సంగీత శిక్షామణి
స్వర్ సాధన రత్న
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అవార్డు

గురు రాజీ నారాయణ్ (1931-2020) ముంబైకి చెందిన భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి, సంగీతకారిణి, స్వరకర్త.[3] ఆమె భరతనాట్యం మాత్రమే కాకుండా, కర్ణాటక సంగీతం, నాట్యశాస్త్రం, నట్టువంగం కూడా బోధించడంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె 1965లో ముంబైలో నృత్య గీతాంజలి అనే సంస్థను స్థాపించింది. ఆమె రెండు దశాబ్దాలకు పైగా ముంబయి విశ్వవిద్యాలయంలో బోర్డు సభ్యురాలిగా ఉంది. ఫైన్ ఆర్ట్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీలకు బాహ్య పరీక్షకురాలిగా పనిచేసింది. అలాగే పి.హెచ్.డి కి థీసిస్ ఎగ్జామినర్ గా కూడా వ్యవహరించింది.[4]

కంపోజిషన్స్, పబ్లికేషన్స్[మార్చు]

రాజీ నారాయణ్ భరతనాట్యం కోసం 200లకి పైగా పాటలను స్వరపరిచారు. వాటిలో కొన్నింటిని తన పుస్తకం నృత్యగీతమాల (2 సంపుటాలు)లో ప్రచురించింది. ఆమె కర్ణాటక సంగీతం ప్రాథమిక విషయాలపై సంగీత శాస్త్ర మాల అనే పుస్తకాన్ని కూడా విడుదల చేసింది. ఆమె నాట్య శాస్త్ర మాల రచయిత, నాట్య శాస్త్రం ప్రాథమికాలను వివరిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. "The Hindu Official Website". The Hindu. Retrieved October 1, 2020.
  2. "Sangeet Natak Official Website". Sangeet Natak. Retrieved October 5, 2020.
  3. "Rajee Narayan Official Website". Rajee Narayan. Retrieved October 1, 2020.
  4. "Rajee Narayan Official Website". Rajee Narayan. Retrieved October 3, 2020.