ముత్తులక్ష్మి రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి
జననంముత్తులక్ష్మి నారాయణ సామి
(1886-07-30)1886 జూలై 30
పుదుక్కొట్టై, మద్రాసు రాష్ట్రం, బ్రిటిషు భారతదేశం
మరణం1968 జూలై 22(1968-07-22) (వయసు 81)
జాతీయతఇండియన్
విశ్వవిద్యాలయాలుమద్రాస్ వైద్య కళాశాల
వృత్తిరచయిత్రి, సమాజ సేవకురాలు, రాజకీయ నాయకురాలు
ప్రసిద్ధిభారతదేశపు మొట్టమొదటి శాసనసభ్యురాలు
భార్య / భర్తడా. సుందర రెడ్డి
పిల్లలుడా. తయుమానవన్
తండ్రిశ్రీ నారాయణ సామి
తల్లిశ్రీమతి చంద్రమ్మాళ్

డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి సంఘ సంస్కర్త, విద్యావేత్త, రాజకీయ వేత్త, స్త్రీ హక్కుల ఉద్యమశీలి, భారతదేశపు మొదటి మహిళా శాసనసభ్యురాలు.

బాల్యం[మార్చు]

ముత్తులక్ష్మి రెడ్డి 1886 జూలై 30 వ తేదీన పుదుక్కోటై సంస్ఠానంలో నారాయణ సామి, చంద్రమ్మాళ్ దంపతులకు జన్మించింది. ఆడపిల్లల చదువుకు ఆంక్షలు ఉన్న ఆ కాలం లోనే ముత్తులక్ష్మి రెడ్డి 1912 వ సంవత్సరంలో మద్రాస్ వైద్య కళాశాల నుండి వైద్య పట్టా అందుకుంది.

సామాజిక సేవ[మార్చు]

సరోజిని నాయుడు ప్రేరణతో ముత్తులక్ష్మి స్త్రీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉన్నతికై పోరాడింది. ఆమె సేవలను మెచ్చి నాటి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి సభ్యురాలిగా 1927 లో నామినేటు చేసింది. ఆ విధంగా భారతదేశపు మొట్ట మొదటి మహిళా శాసన సభ్యురాలైంది. శాసన మండలి సభ్యురాలిగా దేవదాసీ విధాన రద్దు, కనీస వివాహ వయసు పెంపు, నిర్బంధ వ్యభిచారం రద్దు, బాలల హక్కుల రక్షణ తదితర విషయాలపై పోరాడింది. 1931 సంవత్సరపు అఖిల భారత మహిళల సదస్సుకు అధ్యక్షత వహించింది. ఈ సదస్సు తరపున మహిళల ఓటు హక్కుకై పోరాడింది. గాంధీ ఇచ్చిన ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేసింది.[1][2]

స్త్రీధర్మ[మార్చు]

ఈమె మహిళాభ్యుదయం కొరకు "స్త్రీధర్మ" అనే పత్రికను నడిపింది. దీనిలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం నాలుగు భాషలలో రచనలు ఉండేవి.[3]

స్వాతంత్ర్యానంతరం[మార్చు]

ప్రస్తుతం భారతదేశంలోనే అగ్రగామి కాన్సర్ వైద్యశాలగా వెలుగొందుతున్న అడయార్ కాన్సర్ వైద్యశాలను ముత్తులక్ష్మి రెడ్డి 1954 లో ప్రారంభించింది. 1956 లో భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.

మూలాలు[మార్చు]

  1. http://www.iicdelhi.nic.in/publications/uploads_diary_files/22612January212013_IIC%20Occasional%20Publication%2044.pdf[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-19. Retrieved 2014-03-13.
  3. పసుమర్తి, కృష్ణమూర్తి. "శ్రీమతి డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి అమ్మాళ్". గృహలక్ష్మి కంఠాభరణం. మద్రాసు: కె.ఎన్.కేసరి. pp. 138–140. Retrieved 2018-07-27.[permanent dead link]