బాల పాపాంబ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాల పాపాంబ తెలుగులో తొలి యక్షగాన కవయిత్రి.[1] [2]

తొలి జీవితం[మార్చు]

బాల పాపాంబ 16వ శతాబ్ధపు ఉత్తరార్థంలో జీవించివుండవచ్చని చరిత్రకారుల అంచనా. ఈవిడ తల్లిదండ్రులు కామాక్షమ్మ, వీర వసంతరాయలు.

రచనలు[మార్చు]

అక్కమహాదేవి అనే యక్షగానాన్ని రచించింది.[2] చరిత్ర పాపాంబ సుమారు 215 గద్య పద్యాలతో యక్షగానం రచించింది. కానీ, ఇది ముద్రించపడలేదు. దీని ప్రతి తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర పాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో ఉంది. (డి.నెం. 1834, 1835).

ఇతర వివరాలు[మార్చు]

బాల పాపాంబకి యోగశాస్త్రంలో కూడా ప్రావిణ్యం ఉంది. ఈవిడ రాసిన యక్షగానాల్లో జంపె, అట, త్రిపుల, రచ్చరేకులు, ఏకతాళి మొదలైన తాళ ప్రధానమైన దరువులు, ద్విపదలు, వచనములు, కందం వంటి పద్యాలు, అర్థ చంద్రికలు, జోలలు, శోభనాలు, మంగళహారతులు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. దామెర, వేంకట సూర్యారావు. "బాల పాపాంబ". విశిష్ట తెలుగు మహిళలు. రీమ్ పబ్లికేషన్స్. p. 22. ISBN 978-81-8351-2824.
  2. 2.0 2.1 నమస్తే తెలంగాణ. "తెలుగు సాహిత్య ప్రక్రియలు - యక్షగానం". Retrieved 21 April 2017.