నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 19°6′0″N 77°18′0″E |
నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం (Nanded Lok Sabha constituency) మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1967 ముంచి ఇప్పటివరకు జరిగిన 12 లోక్‌సభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, జనతాపార్టీ, జనతాదళ్, భారతీయ జనతా పార్టీలు ఒక్కోసారి విజయం సాధించాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన శంకర్రావు చవాన్, అశోక్‌రావు చవాన్‌లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన భాస్కర్‌రావు ఖట్గాంకర్ ఈ నియోజకవర్గపు లోక్‌సభ సభ్యుడు.
నియోజకవర్గంలోని సెగ్మెంట్లు
[మార్చు]నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సభ్యులు
[మార్చు]- 1967: వెంకటరావు తారోడేకర్ (కాంగ్రెస్ పార్టీ)
- 1971: వెంకటరావు తారోడేకర్ (కాంగ్రెస్ పార్టీ)
- 1977: కేశవ్ ఢోంగ్డే (జనతాపార్టీ)
- 1980: శంకర్రావు చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
- 1984: శంకర్రావు చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
- 1987 (ఉప ఎన్నిక) : అశోక్‌రావు చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
- 1989: వెంకటేష్ కబ్డే (జనతాదళ్)
- 1996: గంగాధర్ కుంటుర్కర్ (కాంగ్రెస్ పార్టీ)
- 1998: భాస్కర్‌రావు ఖట్గాంకర్ (కాంగ్రెస్ పార్టీ)
- 1999: భాస్కర్‌రావు ఖట్గాంకర్ (కాంగ్రెస్ పార్టీ)
- 2004: దిగంబర్ పాటిల్ (భారతీయ జనతా పార్టీ)
- 2009: భాస్కర్‌రావు ఖట్గాంకర్ (కాంగ్రెస్ పార్టీ)
2009 ఎన్నికలు
[మార్చు]2009 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భాస్కర్‌రావు ఖట్గాంకర్ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన సంభాజీ పవార్‌పై 74,614 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. భాస్కర్‌రావు ఖట్గాంకర్కు 3,46,400 ఓట్లు రాగా, సంభాజీకు 2,71,786 ఓట్లు వచ్చాయి.