దిగువమాఘం
దిగువమాఘం, చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలం లోని గ్రామం.ఈ గ్రామం. చిత్తూరు పట్టణం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమరపురి, శివగిరి ఆశ్రమం, వీర్లగుడిపల్లె, దిగువమాఘం హరిజనవాడ, దిగువమాఘం కాలనీ, వీర్లగుడిపల్లె హరిజనవాడ, వీర్లగుడిపల్లె మాదిగవాడ ఈ పంచాయతీ పరిధిలోకి వస్తాయి.
దిగువమాఘం | |
— రెవిన్యూ గ్రామం — | |
గ్రామ ముఖద్వారం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°16′19″N 78°58′08″E / 13.272016°N 78.968904°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండలం | తవణంపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 1,734 |
- పురుషుల | 838 |
- స్త్రీల | 896 |
- గృహాల సంఖ్య | 398 |
పిన్ కోడ్ | 517129 |
ఎస్.టి.డి కోడ్ | 08573 |
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
'మాఘం' ఇంటిపేరు గల రెడ్డి కులస్థులు ఇక్కడ ప్రప్రథమంగా నివసించేవారు. అగ్నిప్రమాదం జరిగి ఊరు కాలిపోగా, వారు ఊరి దిగువ ప్రాంతానికు వచ్చి స్థిరపడ్డారు. దిగువ ప్రాంతాన మాఘం వర్గీయులు నివసించిన ప్రదేశం కావడంతో ఈ గ్రామానికి 'దిగువమాఘం' అనే పేరు వచ్చింది.
భౌగోళికం, జనాభా[మార్చు]
దిగువమాఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, తవణంపల్లె మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తవణంపల్లె నుండి 4 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిత్తూరు నుండి 21 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 417 ఇళ్లతో, 1524 జనాభాతో 310 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 766, ఆడవారి సంఖ్య 758. షెడ్యూల్డ్ కులాల జనాభా 761 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 0. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 596609[1].పిన్ కోడ్: 517129.
సమీప గ్రామాలు[మార్చు]
తడకర, వీర్లగుడిపల్లి, కొండ్రాజుకాల్వ, అరగొండ..
గ్రామ పంచాయితీ[మార్చు]
- ఉప్పాండ్ల కుమార్ నాయుడు - ప్రస్తుత సర్పంచి
దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు[మార్చు]
రామాలయం, రచ్చబండ, సత్తెమ్మ బండ, శివాలయం, ధర్మరాజుల దేవస్థానం, గుండాలమ్మ గుడి, ఎరపాక్షమ్మ గుడి.గ్రామ సంపద అయిన శివగిరి ఆశ్రమం గ్రామ వైభవానికి తలమానికం.
గ్రామ జనాభా[మార్చు]
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 1,734 - పురుషులు 838 - స్త్రీలు 896 - గృహాల సంఖ్య 398
గ్రామ ప్రముఖులు[మార్చు]
'రాజన్న' గా సుప్రసిధ్ధుడైన పాటూరి రాజగోపాల నాయుడు 1900 వ సంవత్సరం నవంబరు 7న దిగువమాఘంలో జన్మించాడు. ఇతను స్వాతంత్ర్య సమర యోధుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. రైతు నాయకుడు. సాహితీవేత్త. సంఘసంస్కర్త. గొప్ప రచయిత. అతని కుమార్తె గల్లా అరుణ కుమారి, మనుమడు గల్లా జయదేవ్ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు.వీరు గ్రామంలో అమరరాజా సంస్థ యొక్క ఒకానొక ప్రధాన విభాగమైన అమరరాజా ఎలెక్ట్రానిక్స్ ని స్థాపించారు. వీరి సంస్థలలోని వివిధ విభాగాలలో గ్రామ యువత, మహిళలకు ఉద్యోగాలు లభించాయి.
సదుపాయాలు[మార్చు]
గ్రామానికి రవాణా, గ్రంథాలయం, పాఠశాల, సహకారసంఘం, బ్యాంకు, తపాలా కార్యాలయం, ఉద్యానవనం, పిల్లల ఆటస్థలం మొదలైన సదుపాయాలు ఉన్నాయి. ఇంకా గ్రామానికి దగ్గరలో వైద్య విద్య సదుపాయాలు వాటితో పాటు వినోద సదుపాయం కూడా ఉంది. 1975 లో గ్రామానికి డబుల్ రోడ్డు ఏర్పడింది.
విద్యా సౌకర్యాలు[మార్చు]
ఈ గ్రామంలో 3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నాయి. సమీప బాలబడి, సమీప మాధ్యమిక పాఠశాల (అరగొండ లో), సమీప సీనియర్ మాధ్యమిక పాఠశాల, సమీప అనియత విద్యా కేంద్రం (తవనంపల్లె లో), సమీప ఇంజనీరింగ్ కళాశాలలు, గ్రామానికి 5 కి.మీ. లోపున ఉన్నాయి. సమీప ఆర్ట్స్, సైన్స్, కామర్సు డిగ్రీ కళాశాల, సమీప మేనేజ్మెంట్ సంస్థ, సమీప పాలీటెక్నిక్, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల (చిత్తూరులో), సమీప వైద్య కళాశాల (తిరుపతిలో) గ్రామానికి 10 కి.మీ. మించి దూరంలో ఉన్నాయి.
ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]
సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, సమీప పశు వైద్యశాల, సమీప సంచార వైద్య శాల, గ్రామానికి 5 కిలోమీటర్ల లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, సమీప మాతా శిశు సంరక్షణా కేంద్రం, సమీప టి.బి వైద్యశాల, సమీప ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సమీప ఆసుపత్రి, సమీప కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామానికి 10 కిలోమీటర్లకు మించి దూరంలో ఉన్నాయి.
తాగు నీరు[మార్చు]
రక్షిత మంచినీటి సరఫరా గ్రామంలో ఉంది. గ్రామంలో మంచినీటి అవసరాలకు చేతిపంపుల నీరు, గొట్టపు బావులు / బోరు బావుల నుంచి నీటిని వినియోగిస్తున్నారు.
పారిశుధ్యం[మార్చు]
గ్రామంలో మూసిన డ్రైనేజీ వ్యవస్థ ఉంది/లేదు. మురుగునీరు నేరుగా నీటి వనరుల్లోకి వదలబడుతోంది. ఈ ప్రాంతం పూర్తి పారిశుధ్యపథకం కిందికి వస్తుంది. సామాజిక మరుగుదొడ్ల సౌకర్యం ఈ గ్రామంలో లేదు.
సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]
ఈ గ్రామంలో టెలిఫోన్ (లాండ్ లైన్) సౌకర్యం, పబ్లిక్ ఫోన్ ఆఫీసు సౌకర్యం, మొబైల్ ఫోన్ కవరేజి, పబ్లిక్ బస్సు సర్వీసు, ప్రైవేట్ బస్సు సర్వీసు, ఆటో సౌకర్యం, ట్రాక్టరు ఉన్నాయి.సమీప పోస్టాఫీసు సౌకర్యం, సమీప ఇంటర్నెట్ కెఫెలు / సామాన్య సేవా కేంద్రాల సౌకర్యం, గ్రామానికి 5 కిలోమీటర్ల లోపు దూరంలో ఉన్నాయి. సమీప ప్రైవేటు కొరియర్ సౌకర్యం, సమీప రైల్వే స్టేషన్, సమీప టాక్సీ సౌకర్యం, గ్రామానికి 10 కిలోమీటర్లకు మించి దూరంలో ఉన్నాయి..సమీప జాతీయ రహదారి గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉంది. సమీప రాష్ట్ర రహదారి గ్రామానికి 10 కిలోమీటర్ల కన్నా దూరంలో ఉంది. . గ్రామంప్రధాన జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది. గ్రామంఇతర జిల్లా రోడ్డుతో అనుసంధానమై ఉంది. సమీప కంకర రోడ్డు గ్రామానికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోపు ఉంది.ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, షేరింగ్ ఆటోలు ఉన్నాయి. గ్రామం చేరుటకు ఎక్కవలసిన బస్సులు (చిత్తూరు నుండి) : అరగొండ, మాధవరం, సరకల్లు, ముచ్చుకాలువ, కామాలూరు, అరగొండ-బంగారుపాళ్యం, మత్యం-బంగారుపాళ్యం, జొన్నగురకల, జి.గొల్లపల్లి, ఎ.గొల్లపల్లి
మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]
గ్రామంలో ట్రాక్టరు, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ ఋణ సంఘం, స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, ఉంది.సమీప వారం వారీ సంత గ్రామానికి 5 కిలోమీటర్ల లోపు ఉంది. సమీప వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామానికి 10 కిలోమీటర్లకు మించి దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]
ఈ గ్రామంలో ఏకీకృత బాలల అభివృద్ధి పథకం (పోషకాహార కేంద్రం), అంగన్ వాడీ కేంద్రం (పోషకాహార కేంద్రం), ఇతర (పోషకాహార కేంద్రం), ఆశా కార్యకర్త (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త), గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం, వార్తాపత్రిక సరఫరా, అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీప ఆటల మైదానం ఈ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. లోపున ఉన్నాయి. సమీప సినిమా / వీడియో హాల్, ఈ గ్రామానికి 10 కి.మీ. మించి దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు[మార్చు]
ఈ గ్రామంలో విద్యుత్తు ఉంది.
భూమి వినియోగం[మార్చు]
గ్రామంలో భూమి వినియోగం ఇలా ఉంది (హెక్టార్లలో) :
- అడవి: 85
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 37
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 12.14
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 0
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 1.25
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 0
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 5.66
- బంజరు భూమి: 77.02
- నికరంగా విత్తిన భూ క్షేత్రం: 91.93
- నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 96.61
- నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూ క్షేత్రం: 78
నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]
గ్రామంలో వ్యవసాయానికి నీటి పారుదల వనరులు ఇలా ఉన్నాయి (హెక్టార్లలో) :
బావులు/గొట్టపు బావులు: 78
ఉత్పత్తి[మార్చు]
ఈ కింది వస్తువులు ఉత్పత్తి చేస్తోంది (పై నుంచి కిందికి తగ్గుతున్న క్రమంలో) :