టుకుని సాహు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టుకుని సాహు

జలవనరులు, వాణిజ్య, రవాణా శాఖ మంత్రి
పదవీ కాలం
2022 జూన్ 5 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – ప్రస్తుతం
నియోజకవర్గం తితిలాగఢ్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1976 మార్చి 13
బలాంగిర్, భారతదేశం
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
తల్లిదండ్రులు మాదబ్ చంద్ర సాహూ
జీవిత భాగస్వామి కి.శే. అభిమన్యు సాహు
సంతానం 2

టుకుని సాహు ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె తిట్లగర్హ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న జలవనరులు, వాణిజ్య, రవాణా శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[1]

రాజకీయ జీవితం[మార్చు]

టుకుని సాహు బిజూ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో తిట్లగర్హ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె 2019లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. టుకుని సాహు నుండి వరకు మహిళా & శిశు సంక్షేమ & మిషన్ శక్తి శాఖల మంత్రిగా, ఆ తరువాత నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2022 జూన్ 5న జలవనరులు, వాణిజ్య, రవాణా శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[2]

మూలాలు[మార్చు]

  1. The Hindu (29 May 2019). "List of Ministers and their portfolios in Naveen Patnaik's Cabinet" (in Indian English). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.