ఉషారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉషారెడ్డి
ఉషారెడ్డి
జననం
ఉషారెడ్డి

విద్యాసంస్థజేఎన్‌టీయూ ఫైన్‌ఆర్ట్స్‌ కళాశాల (హైదరాబాదు)
వృత్తిఆర్కిటెక్ట్
జీవిత భాగస్వామిరఘువీర్‌రెడ్డి
తల్లిదండ్రులులక్ష్మీనర్సింహారెడ్డి (తండ్రి)

ఉషారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్కిటెక్ట్‌. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్‌ భవనాలను డిజైన్‌ చేసి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రశంసలు అందుకున్నది.[1] 2022లో మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విశిష్ట మహిళ పురస్కారంకు అందుకుంది.[2]

జననం, విద్య[మార్చు]

ఉషారెడ్డి తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి జిల్లాలోని భువనగిరి పట్టణంలో జన్మించింది. ఉషారెడ్డి తండ్రి లక్ష్మీనర్సింహారెడ్డి స్వగ్రామం మోటకొండూరు మండలం, చాడ. ఆర్‌అండ్‌బీలో ఏఈగా, ప్రజాపనుల శాఖలో సీఈగా, తర్వాత రైల్వేశాఖలో సలహాదారుగా పనిచేశాడు. ఉషారెడ్డికి ముగ్గురు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. 1961లో డార్జిలింగ్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేసింది. కుటుంబంలో అంతా ఇంజినీర్లే అవడంతో, ఆర్కిటెక్చర్‌ వృత్తికోసం హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ఫైన్‌ఆర్ట్స్‌ కళాశాలలో ఆర్కిటెక్చర్‌ చదివింది. రెండేళ్ళ తరువాత వివాహమవడంతో అమెరికా వెళ్ళి, అక్కడే మిగతా చదువు పూర్తిచేసి, 15 సంవత్సరాలపాటు ఆర్కిటెక్ట్‌గా పనిచేసింది.[3]

తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ విశిష్ట మహిళ పురస్కారం అందుకుంటున్న ఉషారెడ్డి

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఉషారెడ్డికి రఘువీర్‌రెడ్డితో వివాహం జరిగింది. రఘువీర్‌రెడ్డి అమెరికాలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా చేసేవాడు.

వృత్తిరంగం[మార్చు]

ఆర్కిటెక్ట్‌గా అమెరికా, భారత్‌లలో 200కుపైగా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులని పూర్తిచేసింది. వాటిల్లో... ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌ దగ్గర సరస్సు పునరుద్ధరణ, మిల్‌వాకీ దగ్గర బస్‌స్టేషన్లు, ఫెసిలిటీస్‌ భవనాల ప్రాజెక్టులు వంటివి ఉన్నాయి. 1986లో హైదరాబాదుకు వచ్చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసింది. 2002లో కొత్తగా నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనాలలో అప్పటి సెర్ప్‌ కమిషనర్‌ శాంతికుమారి ఆధ్వర్యంలో 9 భవనాలకు ఆర్కిటెక్ట్‌గా పనిచేసింది. ‘భవనాల డిజైన్ చాలా బాగుంద’ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించాడు.[4]

కలెక్టరేట్‌ భవనాలను డిజైన్‌[మార్చు]

2016లో శాంతికుమారి ఇచ్చిన సలహాతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి, కొత్త కలెక్టరేట్‌ల నిర్మాణానికి కావలసిన డిజైన్ లకు సంబంధించిన ప్రాజెక్టును చెపట్టింది. ‘ఓ మారుమూల పల్లెనుంచి వచ్చిన సామాన్యుడు... ఇంటికెళ్లి ‘కలెక్టరేట్‌ చూసొచ్చా అని గొప్పగా చెప్పుకోవాలి’ అని కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం భవన శైలిలో తెలంగాణా సంస్కృతి ప్రతిబింబించేలా చేయడం కోసం ఆరు నెలలు శ్రమించి, లైట్లు, ఏసీల అవసరం లేకుండా భవనంలో ఎక్కడున్నా ఆకాశం కనిపించేలా, గాలీవెలుతురు అందేలా ఉషారెడ్డి ఐదు డిజైన్స్‌ రూపొందించింది. వాటిల్లో ఒకటి ఎంపికవడంతో కలెక్టరేట్‌ల నిర్మాణం జరిగింది.[3]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2022-02-13). "సత్తా చూపిన భువనగిరి బిడ్డ". www.ntnews.com. Archived from the original on 2022-02-13. Retrieved 2022-02-15.
  2. 2.0 2.1 Hindustantimes Telugu (8 March 2022). "వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలకు అవార్డులు.. జాబితా ఇదే." Archived from the original on 8 March 2022. Retrieved 9 March 2022.
  3. 3.0 3.1 "ఆ విషయంలో డిక్టేటర్‌నే". EENADU. 2022-02-15. Archived from the original on 2022-02-15. Retrieved 2022-02-15.
  4. "'ఆమె అందులో రాజీపడదు.. అందుకే కేసీఆర్ మెచ్చుకున్నారు'". ETV Bharat News. 2022-02-13. Archived from the original on 2022-02-15. Retrieved 2022-02-15.