ఈ డీ ఎస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎలక్ట్రానిక్ డాటా సిస్టంస్
స్థాపనJune 27, 1962
ఎలక్ట్రానిక్ డాటా సిస్టంస్
Foundersరోస్ పేరోట్
ప్రధాన కార్యాలయం
ప్లేనో , టెక్సాస్
,
Areas served
ప్రాంతాల సేవలు
Productsఇంఫర్మేషన్ టెక్నాలజీ ఎక్విప్ మెంట్
RevenueUS$22.1 billion (2007)
Number of employees
136,000
Parentజెనరల్ మోటార్స్ 1984–1996
హెల్వెట్-పాకర్డ్ 2008–2015
హెల్వెట్-పాకర్డ్ ఎంటర్ప్రైస్ 2015-2017
డి ఎక్స్ సి టెక్నాలజీస్ 2017–present

టెక్సాస్ లోని ప్లేనో కేంద్రంగా పని చేసే ఎలక్ట్రానిక్ డాటా సిస్టంస్ ఒక బహుళా జాతీయ ఇంఫర్మేషన్ టెక్నాలజీ ఎక్విప్ మెంట్, సేవల సంస్థ.

చరిత్ర[మార్చు]

1962 లో హెచ్. రాస్ పెరాట్ చే స్థాపించబడ్డ ఈ డీ ఎస్ స్వల్పకాలిక కాంట్రాక్టులు రాజ్యమేలుతున్న సమయంలో పెద్ద సంస్థలకు దీర్ఘకాలిక కాంట్రాక్టు పద్ధతి ద్వారా ఆధునిక ఎలెక్ట్రానిక్ డాటా ప్రాసెసింగ్ మేనేజ్ మెంట్ కొరకు మానవ వనరులను, కంప్యూటర్ హార్డ్వేర్ ను సమకూర్చే ఉద్దేశంతో నెలకొల్పబడింది.[1]

2008 నాటికి ఈ డీ ఏస్ లో 1,39,000 ఉద్యోగులతో 64 దేశాలలో ముఖ్యంగా అమెరికా, భారతదేశం, యునైటెడ్ కింగ్డమ్ లలో తన ఉనికి కలిగి ఉండేది.

సేవలు[మార్చు]

ఈడిఎస్ తన సేవలను మూడు సర్వీస్ పోర్ట్ ఫోలియోలుగా విభజించింది; ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అప్లికేషన్, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సేవల్లో నెట్ వర్క్ లు, మెయిన్ ఫ్రేమ్ లు, "మిడ్ రేంజ్" వెబ్ సర్వర్లు, డెస్క్ టాప్ లు అలాగే ల్యాప్ టాప్ లు , ప్రింటర్లు వంటి క్లయింట్ కంప్యూటర్ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల భాగం లేదా అన్నింటి ఆపరేషన్ నిర్వహించడం చేర్చబడుతుంది. అప్లికేషన్ ల సేవల్లో క్లయింట్ ల కొరకు అప్లికేషన్ ల సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేయడం, ఇంటిగ్రేట్ చేయడం లేదా మెయింటైన్ చేయడం జరుగుతుంది. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ లో పేరోల్, కాల్ సెంటర్ లు, ఇన్స్యూరెన్స్ క్లెయింల ప్రాసెసింగ్ మొదలైన క్లయింట్ కొరకు బిజినెస్ ఫంక్షన్ నిర్వహించడం ఉంటుంది.

మూలాలు[మార్చు]

  1. Making IT Work: A History of the Computer Services Industry. Cambridge, Massachusetts: The MIT Press. 2017. ISBN 978-0-262-03672-6.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈ_డీ_ఎస్&oldid=3911473" నుండి వెలికితీశారు