Coordinates: 22°50′02″N 74°15′28″E / 22.83389°N 74.25778°E / 22.83389; 74.25778

దాహోద్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రతన్‌మహల్ జలపాతం
Districts of central Gujarat

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో దాహేద్ జిల్లా ఒకటి. దాహేద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 3,642.జిల్లా పశ్చిమ భారత భూభాగంలో ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 21,26,558. జనసాంధ్రత 583 (చ.కి.మీ). గతంలో ఈ ప్రాంతం పంచ్‌మహల్స్ జిల్లాలో భాగంగా ఉండేది. 1997 అక్టోబరు 2 న పంచ్‌మహల్స్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.

చరిత్ర[మార్చు]

జిల్లాలో గతకాలపు రెండు బిర్లా (దేవ్‌గఢ్) సంజెలి, రాజాస్థానాలు ఉన్నాయి. అదనంగా సునత్ రాజాస్థానంలోని (రాంపూర్) ఫతేపూర్ తాలూకా. వీటితో పూర్వపు రంచ్‌మహల్స్‌కు చెందిన రెండు దాహోద్, ఝాలోద్ రాజమహల్స్ ఉన్నాయి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లాలోని 8.99% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు. [1]

సరిహద్దులు[మార్చు]

జిల్లా పశ్చిమ పశ్చిమ సరిహద్దులో పంచ్‌మహల్స్ జిల్లా, దక్షిణ సరిహద్దులో చోటా ఉదయపుర్ జిల్లా, తూర్పు సరిహద్దులో ఝాబౌ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని అలిరాజ్పూర్ జిల్లా, ఉత్తర, ఈశాన్య సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రంలోని బన్‌స్వార జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో అధికంగా గ్రామీణ ప్రజలు ఉన్నారు. వీరిలో అధికంగా గిరిజనప్రజలు ఉన్నారు. గిరిజనులలో అధికులు భిల్లులు ఉన్నారు. దావూదీ " భోరా సెక్ట్ ఆఫ్ ముస్లింస్ ఇండియా "లో దాహేద్ జసంఖ్యాపరంగా రెండవ స్థానంలో ఉంది.

విభాగాలు[మార్చు]

జిల్లాలోని తాలూకాలు :-

  • దహొద్
  • ఝలోద్
  • దెవ్గధ్ (భరీ) .
  • గర్భద.
  • లింఖెద.
  • ఫతెహ్పుర
  • ధంపుర్

పేరువెనుక చరిత్ర[మార్చు]

అసలైన పేరు దోహద్. తరువాత ఇది దాహేద్‌గా రూపాంతరం చెందింది. ఇక్కడ ఉన్న దాహేద్ కోటలోని మసీదులో ఔరంగజేబు జన్మించాడని భావిస్తున్నారు. 1963లో ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజి నిర్మించబడింది. దీనిని గత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ స్థాపించాడు. ఇప్పుడిక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ , ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించబడ్డాయి. [2] డిగ్రీ కాలేజ్ గుజరాత్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దాహేద్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న గుజరాత్ రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,126,558, [4]
ఇది దాదాపు. నమీబియా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 215వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 582 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 29.95%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 986:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 60.6%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

సరిహద్దులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-13. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-02. Retrieved 2020-01-07. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Namibia – 2,147,585 {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

వెలుపలి లింకులు[మార్చు]

22°50′02″N 74°15′28″E / 22.83389°N 74.25778°E / 22.83389; 74.25778

మూలాలు[మార్చు]