జి. ఉమామహేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆచార్య  గారపాటి ఉమామహేశ్వరరావు

జీవన  వ్యక్తిగత వివరాలు


సారాంశం:

భారతదేశం మరియు విదేశాలలోని పేరెన్నికగన్న వివిధ విశ్వవిద్యాలయాలలో (బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం,  ఉస్మానియా, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, అసం.రా. ) విజ్ఞాన మరియు మానవీయ శాస్త్రాలలో   ఎమ్.ఎస్.సి, ఎమ్.ఏ. ఎమ్.ఏ. ఎమ్.ఫిల్. చదివి    ప్రపంచ ప్రఖ్యాత  భాషాశాస్త్రజ్ఞులైన  కీ.శే. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి,  FRSE గారి పర్యవేక్షణలో  చారిత్రక భాషాశాస్త్రంలో  రాసిన పరిశోధనా వ్యాసానికి పి.హెచ్.డి.  పట్టా పొందారు.   

గతంలో   హైదరాబాద్ విశ్వవిద్యాలయం లోని అనువర్తిత భాషాశాస్త్రం మరియు అనువాద అధ్యయనాల కేంద్రానికి      నిర్దేశకుడిగా పనిచేసి,  2016 లో పదవీ విరమణ చేశారు.  ప్రస్తుతం  పునర్నియమిత ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. అంతర విషయ పరిశోధనా  రంగంలో ముఖ్యంగా భారతీయ భాషల భాషా సాంకేతిక రంగంలో ప్రత్యేకించి యంత్రానువాదంలో  పనిచేశారు. ద్రావిడ, మంగోలియన్ మరియు టర్కిక్ భాషా కుటుంబాలకు మూలమైన  ఉమ్మడి వనరును  జన్యుసంబంధ ప్రక్రియద్వారా పునర్నిర్మాణం చేయడంలో చివరి రెండు దశాబ్దాలుగా నిమగ్నులై ఉన్నారు. భారతీయ భాషా సాంకేతిక రంగానికి సంబంధించి  అనేక పత్రాలు మరియు పుస్తకాలను ప్రచురించారు. తెలుగురాష్ట్రాలలో భాషా సంక్షోభం, ద్రవిడ మరియు మంగోలు భాషల జన్యు సంబంధాలపై పరిశోధనా గ్రంథాల ప్రచురణ. నవ్యరుషి సన్మాన్, (2004); ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశిష్ట పురస్కారం,  కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగానూ, (న్యూఢిల్లీ). భారతీయ భాషాశాస్త్రజ్ఞుల సంఘం అధ్యక్షుడుగానూ, ద్రావిడ భాషా సంఘ అధ్యక్షుడుగానూ, భారతీయభాషలలో యంత్రానువాద పథక ప్రధానపరిశోధకుడిగానూ (ప్రసార సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం), మరియు భారతీయ భాషల కోసం సీమిత భాషావిశ్లేషిణి ఉపకరణాల నిర్మాణ సహవ్యవస్థకు  నాయకుడిగా పనిచేశారు. (సంప్రదించండి: 040-23010846, మొబైల్: +91 9866128846). ప్రస్తుతం తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్నారు. భాషోద్యమ సమాఖ్య మాస పత్రిక సహసంపాదకుడిగా ఉన్నారు.

1. ఉద్యోగం:

 అనువర్తిత భాషాశాస్త్రం మరియు అనువాద అధ్యయానాల కేంద్రంలో *(Centre For Applied Linguistics and Translation Studies) ఉపన్యాసకుడిగా     ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆపైన ఆచార్యుడిగా,    నిర్దేశకుడిగా, అనువర్తిత భాషాశాస్త్రం మరియు అనువాద అధ్యయానాల కేంద్రం, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పనిచేశారు.

2.  అంతర విషయిక  రంగంలో పరిశోధన:

భారతీయ  నేపథ్యంలో    ముఖ్యంగా భారతీయ విశ్వవిద్యాలయాల సందర్భంలో, భాషా సాంకేతిక పరిజ్ఞానాన్ని మొట్టమొదటగా ప్రవేశపెట్టడం ద్వారా మరియు సంగణక భాషాశాస్త్రమనే   అంతర విషయ పరిశోధనా  రంగంలో  పరిశోధన ప్రారంభించారు.  మానవీయశాస్త్ర  పరిశోధనా సంస్కృతిలో కొత్త పోకడలను తీసుకువచ్చారు. కంప్యూటర్ సైన్స్, భాషాశాస్త్రం మరియు మానవీయశాస్త్రాలతో కూడిన ప్రత్యామ్నాయ మరియు అనువర్తిత పరిశోధనలతో తెలుగూ తదితర భాషలలో అనేక ఉపకరణాలను రూపొందించి అభివృద్ధి చేశారు.

3. ప్రయోగశాల నుండి మానవ ప్రయోజనాల  వరకు:

ప్రయోగశాలకు పరిమితమైన ప్రాయోగిక  జ్ఞానాన్ని సృష్టించడం ద్వారా కేవలం ఉపయోగకరమైన   పరిశోధనలలో కొత్త ధోరణులను ప్రారంభించటమేకాక  ప్రజోపయోగం కోసం మానవీయ శాస్త్రాల ఉత్పత్తులు / సాంకేతికత  పరంగా ఉపయోగపడే పరిశోధనా ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. భారత మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరపున ప్రజా ప్రయోజన సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసి, అనేకమార్లు విడుదల చేశారు.

4. జ్ఞాన పంపిణీ:

విజ్ఞాన పరిశోధనా, శిక్షణా   వ్యాప్తిలో ప్రభుత్వ, ప్రభుత్వేతర  సంస్థలతో విస్తృతంగా కలిసి పనిచేశారు. కంప్యూటర్ సైన్స్, భాషాశాస్త్రం మరియు సాహిత్య రంగాలలో పరిశోధనను   సమన్వయం చేస్తూ విద్యార్థులకు శిక్షణను ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా  పత్రికలూ మ్యాగజైన్స్లలో   వందల పరిశోధన పత్రాలూ   గ్రంథాలూ ప్రకటించారు. విజ్ఞాన వ్యాప్తికి వీలు కల్పించేవిధంగా మనదేశమూ   విదేశాలలోనూ  కార్యశాలలనూ  సమావేశాలనూ నిర్వహించారు.

5. ఆవిష్కరణలు:

   ప్రజల వినియోగానికి పనికివచ్చే పలు ఆవిష్కరణలతో పరిశోధనలను విస్తరించారు. భాషాశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, సంగణక భాషాశాస్త్రం    చారిత్రక భాషాశాస్త్రం వంటి అనేక రంగాల్లో  సరికొత్త  ఆవిష్కరణలకు తెరతీశారు.

తల్లిదండ్రులు గారపాటి బాలత్రిపుర సుందరీదేవి, తండ్రి లక్ష్మీనరసింహారావుగార్లు, 2-127/1, జ్ఞానలక్ష్మీ మందిరం, గుంటుపల్లి,  ఇబ్రహీంపట్నం, కృష్ణాజిల్లా, 521241, ఆంధ్రప్రదేశ్య.