కోండ్రు మురళీమోహన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోండ్రు మురళీమోహన్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2014
ముందు కావలి ప్రతిభా భారతి
తరువాత కిమిడి కళావెంకటరావు
నియోజకవర్గం ఎచ్చెర్ల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1969 జులై 8
లావేటిపాలెం, లావేరు మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు అప్పలనరసయ్య

కోండ్రు మురళీమోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విప్‌‌గా, వైద్య విద్య, 108, 104, ఔషధనియంత్రణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కోండ్రు మురళీమోహన్ 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం, లావేటిపాలెం గ్రామంలో జన్మించాడు. ఆయన బీఈ, ఎంబీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కోండ్రు మురళీమోహన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1992 నుండి 97 వరకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. ఆయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. కోండ్రు మురళీ 2000 నుండి 2004 వరకు శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేసి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కావలి ప్రతిభా భారతి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

కోండ్రు మురళీమోహన్ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కావలి ప్రతిభా భారతి పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2009 నుండి 12 వరకు ప్రభుత్వ విప్‌‌గా, 6 ఫిబ్రవరి 2012 నుండి రాష్ట్ర వైద్య విద్య, 108, 104, ఔషధనియంత్రణ, 2013 నుంచి అదనంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరాడు.[1]

కోండ్రు మురళీమోహన్ 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో ఓడిపోయి, 2024లో జరిగిన శాసనసభ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తాలే రాజేష్ పై 20722 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Deccan Chronicle (7 September 2018). "Kondru Murali Mohan joins TDP". Archived from the original on 22 December 2021. Retrieved 22 December 2021.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.