దశావతారములు

వికీపీడియా నుండి
(దశావతారం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


దశావతారాలు - 19వ శతాబ్దికి చెందిన రాజస్థానీ శైలి చిత్రం

పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.

రామ వామన మత్స్య వారాహి

కృష్ణ మోహినీ

నారసింహ హయగ్రీవ

వేంకటేశ్వర పరశు రాముడు


భగవద్గీతలో శ్రీకృష్ణుని సందేశం[మార్చు]

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించు కొందును. సత్పురుషులను పరి రక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.

భగవద్గీత నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన శ్రీ మహా విష్ణువు అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: వ్యాసుడు). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: తిరుపతి వేంకటేశ్వరుడు).

పూర్ణావతారములు[మార్చు]

పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి:

  1. మత్స్యావతారము
  2. కూర్మావతారము
  3. వరాహావతారము
  4. నృసింహావతారము లేదా నరసింహావతారము
  5. వామనావతారము
  6. పరశురామావతారము
  7. రామావతారము
  8. కృష్ణావతారము
  9. మొహినావతారాము
  10. కల్క్యావతారము
  • బలరాముడు స్థానంలో బుద్ధుని శంకరాచార్యులు తీసుకుని వచ్చినట్లు ఒక ప్రతీతి. కానీ వెంకటేశ్వరస్వామి ఈ దశావతారాలలోని వాడు కాదు.

విశేషాలు[మార్చు]

చాలాకాలము నుండి విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. వరాహ, నారసింహ, మత్స్య వామన,రామ, మోహినీ, కృష్ణ ,పరశు రాముడూ , వేంకటేశ్వరుడు , హవగ్రీయుడు ప్రధానావతారాలని పేర్కొనబడింది .

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, నారాయణ తిరుమల లో చిత్రములు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]